టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తన తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో.. “ప్రియమైన కళ్యాణ్ బాబు.. జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, ప్రియమైన సోదరుడు కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ యేడాది నీకు మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి దిగిన ఫొటోను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ వారిద్దరి సోదర బంధాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday… pic.twitter.com/pkry6DtwGA
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: