రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల వాయిదా పడింది.ఈసినిమా రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకావాల్సి వుంది అయితే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలతేదిని వాయిదా వేశారు మేకర్స్.ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ లో విడుదలచేయనున్నారు.కె జి యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.రీసెంట్ గా రిలీజైన మొదటి భాగం గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.త్వరలోనే ట్రైలర్ కూడా విడుదలకానుంది.
మరో వైపు ఈసినిమా విడుదల వాయిదా పడడంతో మిగితా సినిమాలు ఈ డేట్ వాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి.ఈసినిమా కోసం విడుదలకు సిద్ధంగా వుండి వెనక్కి తగ్గిన సినిమాలు సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: