పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భగత్ సింగ్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ జరుపుకోగా త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో పవన్ మాస్ గా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 😎🔥
Wishing our USTAAD of MASS and SWAG, @PawanKalyan garu a very Happy Birthday ❤️🔥#UstaadBhagatSingh 💥#HBDPawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/qXPv9CAoOm
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమా కుడా గబ్బర్ సింగ్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో చూడాలి.
ఇక పవన్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఉదయం విడుదలైన ఓజీ గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఇప్పటివరకు ఈ వీడియో 43లక్షలకు పైగా వ్యూస్ ను అలాగే 5లక్షలకు పైగా లైక్స్ ను రాబట్టింది.ఈ గ్లింప్స్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.ఓజీని సుజీత్ తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: