యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 70.23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.గీత గోవిందం తరువాత 100కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ కు ఇది రెండో సారి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఖుషి 3రోజుల్లో 20కోట్ల షేర్ ను రాబట్టింది.ముఖ్యంగా నైజాంలో అదరగొడుతుంది.ఇక తెలుగు రాష్ట్రాల తరువాత తమిళం లో ఈసినిమా మంచి రన్ కొనసాగిస్తోంది.మూడు రోజుల్లో అక్కడ 5కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.అలాగే ఓవర్సీస్ లో బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటివరకు అక్కడ 1.4 మిలియన్ డాలర్ వసూళ్లను సొంతం చేసుకుంది లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయాలంటే ఫుల్ రన్ లో మరో 20కోట్ల షేర్ ను రాబట్టిల్సివుంది.
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: