సెప్టెంబరులో రిలీజ్ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్

Jawan To Salaar, The Most Awaited Movies Releasing in This September

సినీ ప్రియులకు శుభవార్త. చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన అనేక చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీటిలో స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు సహా మరికొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. జవాన్ నుండి సలార్ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖుషి: ‘నిన్ను కోరి’ మరియు ‘మజిలీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ రూపొందించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలయింది. ఈరోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

జవాన్: ఈ యేడాది ఆరంభంలో ‘పఠాన్’ వంటి సాలిడ్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ నుండి వస్తోన్న మరో చిత్రం ఇది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి, రిధి డోగ్రా మరియు సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కాగా చిత్ర బృందం ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేసింది. ‘జిందా బందా’, ‘చలేయా’ మరియు ‘నాట్ రామయ్యా వస్తవయ్యా’. ప్రస్తుతం ఈ మూడు పాటలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇక ఈ సినిమా హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి: ‘జాతిరత్నాలు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం ఇది. మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా వున్నారు. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించగా.. అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

స్కంద: రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్కంద’. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుస్తోంది. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ లవర్స్‌తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇటీవలే రిలీజైన మూవీ గ్లింప్స్‌, సాంగ్స్ కి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్‌ పోతినేని, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్‌ చేస్తున్నారు.

చంద్రముఖి 2: పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ ‘చంద్రముఖి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి కొనసాగింపుగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ‘చంద్రముఖి 2’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 19న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

సలార్: కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ సినిమా యూఎస్ఎ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రత్యంగిర సినిమాస్ వారు దక్కించుకున్నారు. ఇంతవరకూ ఏ ఇండియన్ సినిమాకు సాధ్యపడని రీతిలో అమెరికా వ్యాప్తంగా 1979 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు వారు ప్రకటించారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 28న సలార్ ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =