పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక ‘ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు, దయ, అపరితమితమైన కరుణను సెలెబ్రేట్ చేసుకుంటున్నాం’ అని పేర్కొంటూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ పోస్టర్‌లో పవన్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో యుద్ధరంగంలో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తుండగా.. వెనుక ఉన్న సైనికులు ఆయనను సంభ్రమాశ్చర్యాలతో చుస్తూండటం గమనించవచ్చు. అలాగే కింద కొందరు ప్రత్యర్థి వర్గానికి చెందిన సైనికులు చనిపోయి పడి ఉన్నారు. ఈ సీన్ లో పవర్ స్టార్ పైన ఎరుపు రంగు అంగీ, కింద నలుపు రంగు ధోతి ధరించి ఉన్నాడు. పోస్టర్ చూస్తుంటూనే.. గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశారు. కాగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 17వ శతాబ్దం నాటి మొఘల్ మరియు కుతుబ్ షాహీ చక్రవర్తుల కాలంనాటి నేపథ్యంలో చారిత్రక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ పీరియాడిక్ మూవీలో పవన్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. దాదాపు రూ.150 కోట్లతో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, విక్రమజీత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: