పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినిపిస్తే అభిమానులకు పూనకాలే. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఆయనను పిచ్చిగా అభిమానిస్తుంటారు మెగా ఫ్యాన్స్. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ పవన తన అభిమానులకు వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అభిమానులు మరిన్ని ఎక్కువ సినిమాలు రావాలని కోరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా.. ఇప్పటికే ‘హరిహరవీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలోనే పవన్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. కాగా గతంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన వాణిజ్య హంగులున్న కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా.. తాజాగా దీనికి సంబంధించి దర్శక, నిర్మాతలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా.. నేడు ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఆయా మూవీ యూనిట్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: