స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది ఏకంగా 14 భాషల్లో రిలీజ్ కానుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ‘కథానార్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమా ప్రధానంగా హారర్ నేపథ్యంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. కాగా ఇది మలయాళ సినిమా కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే..? మలయాళంలో అనుష్కకు ఇదే తొలి సినిమా. 18 ఏళ్ల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. ఇప్పుడు మొదటిసారిగా మాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రోజిన్ థామస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. ఈ క్రమంలో త్వరగా షూటింగ్ ప్రారంభించి, 2024లో మొదటి భాగాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకానొక టైమ్లో తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా కితాబందుకున్న అనుష్క.. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక కేరళలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హీరో జయసూర్య జన్మదినం సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాథర్ జీవితంలో చోటుచేసుకున్న సూపర్ నాచురల్ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో అనుష్క మరోసారి ‘అరుంధతి’ తరహా క్యారక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం అనుష్క, ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్గా నటించగా.. అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందించగా, యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: