తెలుగునాట ‘బిగ్ బాస్’ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ ఏడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా ‘ఉల్టా పుల్టా’ అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ముందుగా హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చే మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లను ఒక్కొక్కరిగా స్టేజిపైకి పిలిచి వారిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే హౌస్‌లోకి ఎంటరైన వారిలో పలువురు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ప్రముఖ నటీనటులు కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. బిగ్‍బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరో ఇక్కడ చూద్దాం.
ఈసారి ప్రత్యేకంగా.. ముందుగానే టాస్క్
కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత వారికి బిగ్‌బాస్ రకరకాల పరీక్షలు పెట్టడం సర్వసాధారణం. అయితే వినూత్నంగా ఈసారి 7వ సీజన్ ప్రారంభోత్సవ వేదికపైనే వారికి ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ పెట్టాడు. దీనిలో భాగంగా ఒక బ్రీఫ్‌కేస్‌లో రూ.20 లక్షల క్యాష్ పెట్టి.. సీజన్ నుంచి వెళ్లిపోవాలనుకునేవారు ఇప్పుడే ఆ మనీ తీసుకుని వెళ్లిపోవచ్చని మొదటి కంటెస్టెంట్‌కు నాగార్జున సూచించాడు. ఆ తర్వాత మొదటి ఐదుగురు కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి వచ్చిన సమయంలో రూ.5 లక్షల చొప్పున పెంచుకుంటూ వారికి ఆశ చూపించారు. కానీ దీనికి ఎవరూ అంగీకరించకుండా హౌస్‌లోకి వెళ్లిపోవడం గమనార్హం.
స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి
ఇక బిగ్‍బాస్ 7వ సీజన్ ప్రారంభం సందర్భంగా కార్యక్రమం మధ్యలో టాలీవుడ్ యువ హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టిలు స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇటీవలే విడుదలైన ‘ఖుషి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ హౌస్‌లోకి ఎంటరయ్యాడు. హోస్ట్ నాగార్జునతో కలిసి సందడి చేశాడు. ఈ క్రమంలో నాగ్.. సమంత ఎక్కడ? అని ప్రశ్నించగా.. అమెరికాలో ఉందని, త్వరలోనే ఇండియాకు వస్తుందని గెస్టుగా వచ్చిన విజయ్ చెప్పాడు. అలాగే కంటెస్టెంట్స్ ఇంట్రడక్షన్ సమయంలో నాగ్.. 15వ కంటెస్టెంట్ అని పిలిచిన సమయంలో నవీన్ పోలిశెట్టి హౌస్‌లోకి రావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఆయన తన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రచారం కోసం వచ్చినట్లు తెలియడంతో అందరూ నవ్వుకున్నారు.
బిగ్‍బాస్ 7వ సీజన్ ప్రసారం ఎక్కడ..? ఏ టైమ్ లో?
‘స్టార్ మా’ ఛానల్ లో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు.. అలాగే శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షోను చూడవచ్చు. అలాగే బిగ్ బాస్ తెలుగు 7 కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది.
బిగ్‍బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్స్ వీరే..
- ప్రియాంక జైన్ – ప్రముఖ సీరియల్ నటి
- శివాజీ – ప్రముఖ సినీ నటుడు
- దామిని భట్ల – బాహుబలి సింగర్
- ప్రిన్స్ యావర్ – మోడల్ కమ్ నటుడు
- లాయర్ శుభశ్రీ – యూ ట్యూబర్
- షకీలా – ప్రముఖ సినీ నటి
- ఆట సందీప్ – డాన్స్ మాస్టర్
- శోభాశెట్టి – కార్తీక దీపం సీరియల్ నటి
- రతిక – యువ సినీ నటి
- టేస్టీ తేజ – జబర్దస్త్ కమెడియన్
- గౌతమ్ కృష్ణ – యువ సినీ నటుడు
- కిరణ్ రాథోడ్ – ప్రముఖ సినీ నటి
- పల్లవి ప్రశాంత్ – యువ రైతు, యూ ట్యూబర్
- అమర్ దీప్ – సీరియల్ నటుడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: