ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీతోనే రికార్డ్ క్రియేట్ చేసిన నయనతార

Nayanthara Makes Her Instagram Debut with Fastest One Million Followers

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటీమణుల్లో నయనతార ఒకరు. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె, పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌లో నటించడం ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం నయనతార, షారుఖ్‌ఖాన్‌-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘జవాన్‌’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న జవాన్‌ చిత్రంలో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపించనుంది. నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ కనిపించదు. ఇక ఏదైనా విషయం అభిమానులతో పంచుకోవాలంటే తన భర్త, ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ ఖాతాని వినియోగిస్తుంటుంది. కాగా ఇప్పటివరకూ నయనతారకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి కానీ, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లేకపోవడం గమనార్హం. అయితే తాజాగా ఆమె అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాఖీ పండగ సందర్భంగా.. న‌య‌న‌తార గురువారం ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. తన ఇద్దరు కవల పిల్లలతో (ఉయిర్‌, ఉలగం) ఉన్న వీడియోను తొలుత షేర్‌ చేసింది. ఈ క్రమంలో ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన బిడ్డలు ఉయిర్‌ – ఉలగంలను ఎత్తుకుని కనిపించింది. దీనికి ‘నేను ఇక్కడ ఉన్నా… చెప్పండి’ అనే క్యాప్షన్‌ యాడ్ చేసింది. అలాగే నయనతార సెకండ్ పోస్ట్ లో ‘జవాన్’ ట్రైలర్‌ను పంచుకుంది. అందులో షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి.. ‘మై ఫస్ట్ విత్ మై ఫేవ్‌వివ్ @iamsrk. మీరు దీన్ని ఇష్టపడతారని మరియు ఎప్పటిలాగే ప్రేమను కురిపించాలని ఆశిస్తున్నాను’ అని క్యాప్షన్‌ పెట్టింది.

ఇక నయన్, ఇన్‌స్టా అకౌంట్‌ ప్రారంభించిన వెంటనే ఆమెను మిలియన్ల మంది ఫాలో అవడం విశేషం. అలాగే తన పిల్లలతో కలిసి ఉన్న పోస్ట్ కు రెండు మిలియన్‌ వ్యూస్‌పైగా వచ్చాయి. అయితే ఇలా పోస్ట్ పెట్టిందో, లేదో.. నయన్ అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లు ఒక్కసారిగా ఇన్‌స్టా ఖాతాపై ఓ లుక్కేశారు. దీంతో కొన్ని గంటల్లోనే ఆమెకు మిలియన్‌ ఫాలోవర్లను తెచ్చి పెట్టింది. తక్కువ సమయంలో (24 గంటల్లోపే) మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన హీరోయిన్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది నయనతార. కాగా గతంలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్‌ మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను చేరుకునేందుకు 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఇక నయన్ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లు మార్కుని చేరుకోవడం పెద్ద పనేం కాదని అభిప్రాయపడుతున్నారు నెటిజెన్లు. ఇక జవాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =