
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 47


బిగ్ బీ కి మెగాస్టార్ బర్త్ డే విషెస్

'గేమ్ ఛేంజర్' షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్

సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్ బాబుది డిఫరెంట్ స్టైల్. మహేష్ డైలాగ్ డెలివరీకి, యాక్టింగ్ స్టైల్‍కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక యాక్షన్ ఘట్టాల్లో ఆయన చూపుల్లో ఉండే ఇంటెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కెరీర్ బిగినింగ్‌లో లవర్ బాయ్, సాఫ్ట్ నేచర్ తరహా క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించిన మహేష్ బాబు.. ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ హీరోగా మారారు. అయితే ఇదిలా ఉంటె.. మహేష్ కెరీర్ తొలినాళ్ళనుంచీ ఇప్పటికీ ఒకే విధంగా కనిపించడం గమనార్హం. దీనికి కారణం ఆయనకి ఫిట్‌నెస్‌పై ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్. ఈ క్రమంలో మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ అందుకే డైరెక్ట్ చేయలేదు-కార్తీక్ సుబ్బరాజు
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈసినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. మరోవైపు ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా శంకర్ ఇచ్చాడు.

లియో మూడో సాంగ్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో విడుదలకు సిద్దమవుతుంది.కోలీవుడ్ లోనే కాదు తెలుగులోకూడా ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో ను డైరెక్ట్ చేయడంతో ఇక్కడ కూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది. ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక పాటల విషయానికి వస్తే విజయ్ కి అనిరుధ్ ఎప్పుడూ మంచి సాంగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు.ఈసినిమాకు కుడా మంచి ఆల్బమ్ రెడీ చేసాడు.అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా మరో సాంగ్ విడుదలైయింది.ఈసాంగ్ కూడా ఆకట్టుకుంది.

ట్రెండింగ్ డైరెక్టర్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ కు అవార్డ్
పి.మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. కొత్త కాన్సెప్ట్ లను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ఇప్పుడు ఈసినిమా మరోసారి నిరూపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించి లాభాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ
రామ్‌గోపాల్ వర్మ.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్‌లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో 'రంగీలా', 'సత్య', 'సర్కార్' వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. 'పవర్ స్టార్', 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మరియు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

యాక్షన్ సీక్వెన్స్‌లో బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. ఫైట్ మాస్టర్ వెంకట్
యాక్షన్ సీక్వెన్స్‌లో నందమూరి బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో 'భగవంత్ కేసరి' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల…

ఆదికేశవ నుండి సాంగ్ రిలీజ్
యంగ్ హీరో వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ.ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ,ఫస్ట్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ హే బుజ్జి బంగారం రిలీజ్ చేశారు.మెలోడీ గా వచ్చిన ఈ సాంగ్ కూడా బాగుంది. రామజోగయ్య లిరిక్స్ అందించగా బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ అలాగే యామిని ఘంటసాల పాడారు.

కల్కి2898 ఏడీ నుండి బిగ్ బీ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది.

బిగ్ బీ కి మెగాస్టార్ బర్త్ డే విషెస్
నేడు బాలీవుడ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే గురూజీ.. మీరు ఎల్లప్పుడూ సంతోషంతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని.. మీ నటనతో అనేక సంవత్సరాలపాటు మాఅందరికీ స్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకమైనది.. మీ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ లో పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 27 ఏళ్ళు.. పవర్ స్టార్‌పై ప్రత్యేక కథనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఈ పేరు వినపడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. థియేటర్ల వద్ద సందడి మాములుగా ఉండదు. టాలీవుడ్ హీరోలలో మరే హీరోకు లేనటువంటి డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సొంతం. ఎవరైనా ఆయనను ఒక్క మాట అన్నా అభిమానులు తట్టుకోలేరు. 'అంతకుమించి' అనే స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ పేరుంది. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్…

'గేమ్ ఛేంజర్' షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. ఇక…

యానిమల్- సూపర్ విజువల్స్ తో అమ్మాయి సాంగ్ రిలీజ్
సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

క్రేజీ గా మ్యాడ్ సినిమా 5 డేస్ కలెక్షన్స్
ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటాయి కొన్ని సినిమాలు. కంటెంట్ ఉంటే చిన్న సినిమానా లేక పెద్దసినిమానా అని చూడకుండా ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. రీసెంట్ గా రిలీజైన మ్యాడ్ సినిమాకు అలాంటి ఆదరణే లభిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వారందరూ కొత్తవాళ్లే అయినా కూడా అలాంటి ఫీలింగ్ ఎక్కడా లేకుండా అందరూ చాలా ఈజ్…

విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈ ఏడాది సమ్మర్ టైంలో 'దాస్ కా ధమ్కీ' మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు విశ్వక్. అలాగే నేహా శెట్టి నటించిన 'బెదురులంక' మూవీ కూడా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వక్ సేన్, నేహా శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై హైప్ క్రియేట్ అయింది. ఇక ఇందులో విశ్వక్ రగ్గడ్ మాస్ లుక్‍తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

వైజయంతీ మూవీస్ మరో లీగల్ నోటీస్.. జగదేకవీరుడు అతిలోక సుందరి హక్కులు మావే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది వైజయంతీ మూవీస్ సంస్థ వారు. ఆ మధ్య కాస్త డల్ అయినా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చి సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాస్ హీరోగా ల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఈసినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే మేకర్స్ ఈసినిమా లీకుల విషయంలో స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఈసినిమా హక్కులన్నీ నిర్మాణ సంస్థకే చెందుతాయి.. ఈ సినిమాలోని ఏదైనా సీన్ కానీ ఫొటో కానీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా…

లియో మూడో సాంగ్ అప్ డేట్
ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో లియో ఒకటి. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనుండగా తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

దిల్ రాజుకి పితృ వియోగం.. రామ్ చరణ్ సహా పలువురు ప్రముఖుల పరామర్శ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్యామ్‌సుందర్ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక దిల్ రాజు ఇంట విషాదం చోటుచేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు దిల్ రాజుని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి వెళ్లి శ్యామ్‌సుందర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి దిల్ రాజును ఓదార్చారు.

బబుల్‌గమ్ రోషన్ కి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది-నాని
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్న నాని టీజర్ ను రిలీజ్ చేశారు.

రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్
ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో…

సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద సినిమాలకు లీకుల గోల తప్పట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే గేమ్ ఛేంజర్ మేకర్స్ అయితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు కూడా లీకుల గోల తప్పట్లేదు. ఈసినిమాకు సంబంధించి కూడా అప్పుడప్పుడు పలు ఫొటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.