ట్రెండింగ్ డైరెక్టర్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ కు అవార్డ్

miss shetty mr polishetty director win trending director award

పి.మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. కొత్త కాన్సెప్ట్ లను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ఇప్పుడు ఈసినిమా మరోసారి నిరూపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించి లాభాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా డైరెక్టర్ కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈసినిమా డైరెక్టర్ మహేష్ బాబుకు ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ట్రెండింగ్ డైరెక్టర్ అనే అవార్డ్ దక్కింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.