సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్

Superstar Mahesh Babu's Latest Pics Gone Viral in Social Media

టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్ బాబుది డిఫరెంట్ స్టైల్. మహేష్ డైలాగ్ డెలివరీకి, యాక్టింగ్ స్టైల్‍కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక యాక్షన్ ఘట్టాల్లో ఆయన చూపుల్లో ఉండే ఇంటెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కెరీర్ బిగినింగ్‌లో లవర్ బాయ్, సాఫ్ట్ నేచర్ తరహా క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించిన మహేష్ బాబు.. ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ హీరోగా మారారు. అయితే ఇదిలా ఉంటె.. మహేష్ కెరీర్ తొలినాళ్ళనుంచీ ఇప్పటికీ ఒకే విధంగా కనిపించడం గమనార్హం. దీనికి కారణం ఆయనకి ఫిట్‌నెస్‌పై ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్. ఈ క్రమంలో మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మహేష్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటో ఒకటి, అలాగే ఒక కమర్షియల్ యాడ్ షూట్ కోసం సూట్ ధరించి ఉన్న ఫోటో మరొకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ రెండు ఫోటోలలో మహేష్ బాబు ఫుల్ ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఇక గురువారం జిమ్‌లో తాను వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోను మహేష్ అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో.. “హార్డ్ వర్క్ విషయానికి వస్తే ఎప్పటికీ బ్లాక్ అండ్ వైట్ అనేది ఉండదు.. కేవలం దానిని రూపుదిద్దడం ఒక్కటే ఉంటుంది” అని అర్ధం వచ్చేలా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఫొటోలో మహేష్ బాబు కఠినమైన కసరత్తులు చేస్తుండటం, అలాగే కండలు తిరిగిన ఆయన దేహంతో కనిపించడం మనం చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

అయితే మహేష్ ఈ వర్కవుట్స్ చేస్తోంది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ష‌న్‌లో చేయ‌నున్న మూవీ కోసమే అయి ఉంటుందా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ? ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక సాహసికుడి పాత్రలో నటించనున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. కాగా ప్రస్తుతానికి ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ చిత్రం పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి తెరెకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.

దీంతో రాజమౌళి సూచనల మేరకు మహేష్ బాబు ఇందులో సూపర్ హీరోగా కనిపించడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారని మూవీ లవర్స్ అంటున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా రాబోతోంది. దీనికి ‘గుంటూరు కారం’ అని టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =