వ్యూహం, శ‌ప‌థం సినిమాల రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ

RGV Announces The Release Dates of Vyooham and Shapadham Movies

రామ్‌గోపాల్‌ వ‌ర్మ‌.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్‌లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’ వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ఏపీ సీఏం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు వర్మ. ఈ సీక్వెల్‌కు శ‌ప‌థం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల విడుదల తేదీలను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒకే పోస్ట‌ర్ ద్వారా వ్యూహం, శ‌ప‌థం సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు. దీనిప్రకారం.. ‘వ్యూహం’ సినిమాను న‌వంబ‌ర్ 10వ తేదీన, అలాగే ‘శ‌ప‌థం’ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. కాగా గత కొన్ని రోజుల క్రితం ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన ఆయన.. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండో టీజర్‌ను రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాల ద్వారా రామ్‌గోపాల్‌ వ‌ర్మ‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ పరిస్థితులు మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల ఆధారంగా, వైఎస్ జగన్ రాజకీయ శక్తిగా ఎదగడం వంటి కొన్ని కీలక ఘట్టాలను చూపించనున్నారు. అయితే సాధారణంగా వర్మ తన సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో మాత్రం కాంట్రవర్సీ విషయాలను ఎక్కువగా హైలైట్ చేస్తుంటారని టాక్ ఉంది. కాగా మరికొన్ని నెలల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వర్మ ఇలా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ చిత్రాలను రిలీజ్ చేయనుండటంతో ఆసక్తికరంగా మారింది. కాగా ఈ రెండు సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.