లియో మూడో సాంగ్ రిలీజ్ 

leo third single out now

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో విడుదలకు సిద్దమవుతుంది.కోలీవుడ్ లోనే కాదు తెలుగులోకూడా ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు  లోకేష్ కనగరాజ్ లియో ను డైరెక్ట్ చేయడంతో ఇక్కడ కూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది. ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక పాటల విషయానికి వస్తే విజయ్ కి అనిరుధ్ ఎప్పుడూ మంచి సాంగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు.ఈసినిమాకు కుడా మంచి ఆల్బమ్ రెడీ చేసాడు.అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా మరో సాంగ్ విడుదలైయింది.ఈసాంగ్ కూడా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగు లో ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లోకూడా ప్రీ రిలీజ్ఈ వెంట్ ను చేయడానికిసన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.అనిరుధ్ తోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారని టాక్.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.మచ్ అవైటెడ్ మూవీగా వస్తున్న లియో భారీ లెవెల్లో విడుదలకానుంది.దాంతో మొదటి రోజే ఈ సినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.హిట్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.కోలీవుడ్ లో సోలో గానే వస్తుండగా తెలుగులో మాత్రం  ఈసినిమా భారీ పోటీ ఎదుర్కోనుంది.లియో ఈనెల 19న విడుదలవుతుంది.అదే రోజు బాలకృష్ణ భగవంత్ కేసరి వస్తుంది.మరి ఈ సినిమాను లియో ఎలా తట్టుకుంటుందో చూడాలి.

లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లియోలో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్,అర్జున్ సర్జ, గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.సెవెన్ స్క్రీన్ బ్యానర్ ఫై లలిత్ కుమార్ నిర్మించాడు.తెలుగులో ఈసినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =