గేమ్ ఛేంజర్ అందుకే డైరెక్ట్ చేయలేదు-కార్తీక్ సుబ్బరాజు

karthik subbaraj shares interesting facts about game changer movie

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈసినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్‌ చ‌ర‌ణ్‌ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. మరోవైపు ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా శంకర్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొన్నేళ్ల క్రితం శంకర్ గారు నాకు ఫోన్ చేసి ఏమైనా కథలు ఉన్నాయా అని అడిగారు.. అప్పుడు నేను గేమ్ ఛేంజర్ కథను చెప్పాను. కథ శంకర్ గారికి ఎంతో నచ్చింది. అయితే గేమ్ ఛేంజర్ కథ పెద్ద సినిమా.. ఆ కథని శంకర్ గారు మాత్రమే తెరకెక్కించగలరు అందుకే నేను దర్శకత్వం వహించలేదని అన్నారు. ఖచ్చితంగా శంకర్ గారి మార్క్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఈ సినిమా అద్భుతంగా రూపొందుతోందని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =