కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 41

Ravi Teja and Gopichand Malineni's RT4GM Movie Begins
సినిమా వార్తలు

రవితేజ, గోపీచంద్ మలినేని #RT4GM ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని నాల్గవ సారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా ఫ్లోర్‌లపైకి వెళ్ళకముందే ప్రతి అనౌన్స్ మెంట్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న #RT4GM భారీ స్థాయిలో రూపొందనుంది. ప్రముఖ తమిళ దర్శక, నటుడు సెల్వరాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుండటం విశేషం. నటుడిగా మారిన ఫిల్మ్ మేకర్ సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. అలాగే ఇంధూజ రవిచంద్రన్ ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక #RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుందని, ఈ…

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi and Mahesh Babu Attends Venkatesh's Daughter Engagement
సినిమా వార్తలు

వెంకటేష్ రెండో కుమార్తె ఎంగేజ్‌మెంట్.. హాజరైన చిరంజీవి, మహేష్ బాబు

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ ఇంట శుభకార్యం జరిగింది. ఈ సీనియ‌ర్ హీరో ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. కాగా ఆయన రెండవ కుమార్తె నిశ్చితార్థం వేడుకను తాజాగా నిర్వహించారు. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ డాక్ట‌ర్ త‌న‌యుడితో వెంకీ రెండో కుమార్తె హ‌వ్య‌వాహిని వివాహం నిశ్చయమైంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇక ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్‌ చిరంజీవి మరియు సూపర్‌స్టార్‌ మ‌హేష్ బాబు దంపతులు ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Raghava Lawrence and Kangana Ranaut's Chandramukhi 2 Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి చంద్రముఖి 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'. గతంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (తలైవర్) కల్ట్ మూవీ 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌ పోషించిన ఈ సినిమాలో వడివేలు, రావు రమేష్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసుయే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇక హీరో రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2' విడుదలకు ముందు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. తాను…

Srikanth Mవాట్సాప్
Jigarthanda Double X Movie telugu release update
సినిమా వార్తలు

జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగులో రిలీజ్ చేసేది ఎవరంటే?

ఈమధ్య హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అలాంటి సీక్వెలే మరొకటి వస్తుంది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే దీపావళికి సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు కానీ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Second Single Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

‘ఊరు పేరు భైరవకోన’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
og makers blasting birthday wishes to director sujeeth
సినిమా వార్తలు

OG డైరెక్టర్ కు బర్త్ డే విషెస్- ఈ ఏడాది పేల్చి పడేద్దాం

రన్ ‌రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అయితే సుజీత్ నుండి వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు సుజీత్. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి.

TFN Adminవాట్సాప్
Ravi Teja and Gopichand Malineni's RT4GM Movie Updates
సినిమా వార్తలు

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో మూవీ.. బ్లాస్టింగ్‌ అప్‌డేట్స్

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలో డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. #RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుంది. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ 'బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి'…

Srikanth Mవాట్సాప్
animal movie second song release date update
సాంగ్

యానిమల్ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
vijay leo movie six days collections
బాక్సాఫీస్

లియో సంచలనం 6 రోజుల్లో 500 కోట్లు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
second single release date fixed from Aakasam Dhaati Vasthaava movie
రిలీజ్ అప్‌డేట్

ఆకాశం దాటి వస్తావా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కొత్త టాలెంట్ ను ఎంకరేంజ్ చేయడానికి గాను దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ దిల్ రాజు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈప్రొడక్షన్స్ నుండి బలగం సినిమా వచ్చి అంతర్జాతీయంగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మరో సినిమా ఆకాశం దాటి వస్తావా. కొరియోగ్రాఫర్ యశ్ ప్రధాన పాత్రలో ఆకాశం దాటి వస్తావా అనే సినిమాను రూపొందిస్తున్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Leelammo mass song out from Aadikeshava movie
సాంగ్

ఆదికేశవ- లీలమ్మో మాస్ బ్లాస్ట్ సాంగ్ రిలీజ్

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న సినిమా ఆదికేశవ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నటించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ షూటింగ్ లేట్ గా పూర్తవ్వడంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమాకు రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Dil Raju Interesting Comments on Balakrishna and Sreeleela
సినిమా వార్తలు

బాలకృష్ణ, శ్రీలీలపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘భగవంత్ కేసరి’ సినిమా అద్భుతమైన చిత్రమని, ఇందులో హీరో నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలీల ఇరువురూ తమ అత్యద్భుతమైన నటనను కనబరిచారని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయం సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో రికార్డ్…

Srikanth Mవాట్సాప్
rajinikanth interesting post on amitabh bachchan
సినిమా వార్తలు

33 ఏళ్ల తరువాత నా గురువుతో

సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీ అయిపోయారు. ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది బరిలో దిగనుంది

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Wishes Movie Team in Bhagavanth Kesari Success Meet
సినిమా వార్తలు

భగవంత్ కేసరి ఒక విస్పోటనంతో పుట్టింది - నందమూరి బాలకృష్ణ

‘భగవంత్ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టిందని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు…

Srikanth Mవాట్సాప్
chiranjeevi helps his childhood friend medical treatment
సినిమా వార్తలు

చిన్న నాటి స్నేహితుడి కోసం చిరు సాయం

మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో చిరు ఎప్పుడూ ముదుంటారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోసారి తన ఉదారతను చూపించారు చిరు. తాజాగా తన చిన్న నాటి స్నేహితుడికి అండగా నిలిచారు చిరు. చిరంజీవి చిన్న నాటి స్నేహితుడైన పువ్వాడ రాజ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి తన స్నేహితుడికి చికిత్సా ఏర్పాట్లు చేశారట. అంతేకాదు అపోలో ఆస్పత్రికి…

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari Movie Enters Rs 100 Cr Club
సినిమా వార్తలు

రూ. 100 కోట్ల క్లబ్‌లో 'భగవంత్ కేసరి'.. బాలకృష్ణ సరికొత్త రికార్డ్

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి…

Srikanth Mవాట్సాప్
Dussehra special poster released from Ustaad Bhagat Singh Movie
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్- దసరా స్పెషల్ పోస్టర్ రిలీజ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు మరోసారి పవర్ స్టార్ తన స్వాగ్, డైలాగ్, లుక్స్ తో మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నట్టు అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu's Guntur Kaaram First Single to be Out Very Soon
సినిమా వార్తలు

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' విజయం సాధించగా.. 'ఖలేజా" అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో 'గుంటూరు కారం' మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది…

Srikanth Mవాట్సాప్
Devara Team Released NTR's Weapon Look Poster During Dussehra
ఫస్ట్ లుక్

ఆయుధ పూజ షురూ చేసిన దేవర టీమ్.. కొత్త పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండటం మరో విశేషం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్‌ హిట్ 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా…

Srikanth Mవాట్సాప్
vijay 68th movie grand launch
సినిమా వార్తలు

విజయ్ 68 మూవీ గ్రాండ్ లాంచ్

దళపతి విజయ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి హిట్ ను అందించింది. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అప్పుడే తన కొత్త సినిమాపై ఫోకస్ ను పెట్టాడు. విజయ్ 68 వ సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్

షేర్