రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో మూవీ.. బ్లాస్టింగ్‌ అప్‌డేట్స్

Ravi Teja and Gopichand Malineni's RT4GM Movie Updates

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలో డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. #RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుంది. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అని అనౌన్స్ చేశారు. ఈరోజు, రేపు ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు సెల్వరాఘవన్. ఈ పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్‌గా ఉండబోతుంది. అలాగే రవితేజ ఈ చిత్రంలో మునుపెన్నడూ చేయని పాత్రలో నటించనున్నారు. ఇక సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. క్రాక్, బిగిల్, మెర్సల్, ఇటివలే ‘జవాన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పని చేసిన స్టార్ డీవోపీ జికే విష్ణు.. ఈ చిత్రంతో మరోసారి రవితేజ, గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. వీరితోపాటు మరికొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్ అండ్ టెక్నికల్ టీం పని చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =