భగవంత్ కేసరి ఒక విస్పోటనంతో పుట్టింది – నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Wishes Movie Team in Bhagavanth Kesari Success Meet

‘భగవంత్ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టిందని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో ‘భగవంత్ కేసరి’ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శక్తికి నిర్వచనం స్త్రీ. అలాంటి స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ. అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం. నా 108వ చిత్రం భగవంత్ కేసరి ఈ నవరాత్రుల్లో విడుదల కావడం, ఈ చిత్రానికి మూలం స్త్రీశక్తి కావడం, అమ్మవారి వాహనం పులి కావడం, ఈ చిత్రం కూడా బనావో బేటికో షేర్ అనే అంశంతో చేయడం చాలా సంతోషంగా వుంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో మేమంతా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు.

“తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్రపరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం ‘భగవంత్ కేసరి’. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘గౌతమీపుత్రశాతకర్ణి’.. ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసే అవాకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి నా అభిమాని. ఎంత ఎదిగినా ఒదిగివుండే తన స్వభావం, అంకితభావం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. ప్రతి మహిళ కూడా తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలి. ఈ సినిమాతో ఇలాంటి మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తున్నాను. శ్రీలీలకు తనలో నటన ప్రతిభని చూపించే పాత్ర దక్కింది. కాజల్ తన అనుభవం అంతా రంగరించి తన పాత్రని చక్కగా చేశారు. అర్జున్ రాంపాల్ గారు జాతీయ అవార్డ్ పొందిన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రని అద్భుతంగా పోషించారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం” అని చెప్పారు.

ఇంకా బాలకృష్ణ ఇలా అన్నారు.. “థమన్ నా చిత్రాలకు హైఎనర్జీ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రం పాటలు నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా చేశారు. రామ్ ప్రసాద్ నా ప్రతికదలిక తెలిసిన కెమరామెన్. దర్శకుడు మనసులో వున్న కాన్సప్ట్ ని అద్భుతంగా ఒడిసిపట్టుకుంటాడు. జయచిత్ర గారు చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఏదైనా విస్పోటనం జరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. భగవంత్ కేసరి కూడా అలాంటి ఒక విస్పోటనంతో పుట్టింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ నిర్మాతలు సాహు, హరీష్ పరిశ్రమకు దొరికిన మంచి నిర్మాతలు. మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలనే ప్యాషన్ వున్న నిర్మాతలు. కేవలం డబ్బు కోసమే కాదు.. మంచి సినిమాలు తీయాలి, సంస్థ నిలబడాలనే గొప్ప ఉద్దేశంతో పని చేస్తున్న సాహు, హరీష్ కు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, అజ్జు .. ఇలా అందరూ చక్కగా కుదిరారు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “”వెంకట్ మాస్టర్ అద్భుతమైన పోరాటాలు డిజైన్ చేశారు. పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, వీఎఫ్ ఎక్స్ నరేంద్ర మంచి పని తీరు కనబరిచారు. మా నటులు జానకి, శకుంతుల, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, రచ్చరవి, జీవన్, శ్రవణ్, భరత్ రెడ్డి ఆనంద్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం సమిష్టి కృషి. ఈ చిత్రం కోసం ‘దంచవే మేనత్త కూతురా’ పాటని చాలా గ్రాండ్ గా తీశాం. ఇప్పుడా పాటని అభిమానులు, ప్రేక్షకులు కోరిక మేరకు యాడ్ చేస్తున్నాం. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమికి డబుల్ ధమాకా… అటు పండగ.. ఇటు భగవంత్ కేసరి ఘన విజయం” అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =