అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే మొదటిపాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అమ్మాయి అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ కు డేట్ ఫిక్స్ చేశారు. సత్రంగ అనే పాటను అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈపాటను ఆర్జిత్ సింగ్ పాడనున్నాడు.
The magical combination of #RanbirKapoor and @arijitsingh is back!#Satranga will be all yours on 27th October ❤️#Animal2ndSong #SatrangaOn27thOct #Animal #AnimalOn1stDec #AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @shreyaspuranik… pic.twitter.com/msf8CaqVvk
— Animal The Film (@AnimalTheFilm) October 25, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: