టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచగా.. ఫస్ట్ సింగిల్ ‘నిజమే చెబుతున్నా’ చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్‌తో వచ్చారు. ‘ఊరు పేరు భైరవకోన’ నుంచి సెకండ్ సింగిల్ ‘హమ్మా హమ్మా’ పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాగా ఇందులో లీడ్ పెయిర్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ లవ్లీ అండ్ గ్రేస్ ఫుల్ గా కనిపించారు.
ఇక సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మొత్తం గరుడ పురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా.. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: