జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగులో రిలీజ్ చేసేది ఎవరంటే?

Jigarthanda Double X Movie telugu release update

ఈమధ్య హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అలాంటి సీక్వెలే మరొకటి వస్తుంది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే దీపావళికి సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు కానీ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా వేరే భాషల్లోని సినిమాలను తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లు హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా తెలుగు రిలీజ్ హక్కులను రెండు ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు ఏసియన్‌ సినిమాస్ విడుదల చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అధికారికంగా ట్వీట్ చేశారు మేకర్స్‌.

కాగా ఈ సినిమా లో లారెన్స్ హీరో గా నటిస్తుండగా ఎస్ జే సూర్య కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, టీజర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా మాస్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 13 =