టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండటం మరో విశేషం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో విజయదశమి సందర్భంగా.. ‘దేవర’ మూవీ మేకర్స్ ఆయుధ పూజ షురూ చేశారు. దీనిలో భాగంగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ మేరకు సోషల్ మీడియాలో “ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆయుధం ఏంటంటే..? ఆ ఆయుధాన్ని పట్టుకున్న చేయి” అంటూ ఒక కాప్షన్ జోడించారు. ఇందులో ఎన్టీఆర్ చేయి కనిపిస్తూ ఉండగా.. చేతిలో ఒక పదునైన ఆయుధాన్ని ధరించి ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ‘దేవర’లో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లో వాడనున్న వెపన్ ఇదే కావొచ్చు అంటూ జూనియర్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The deadliest weapon in the world is the hand holding the weapon ❤️🔥
Team #Devara wishes you all a very Happy Dussehra 🔥 pic.twitter.com/2MU8rcs8gk
— Devara (@DevaraMovie) October 23, 2023
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.
కాగా ఇదిలా ఉండగా.. ఇటీవలే దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఆయన ప్రదర్శించిన నటనకుగానూ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సైతం జూనియర్ స్థానం సంపాదించారు. ఈ మేరకు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’లో తారక్‌కి స్థానం కల్పిస్తున్నట్లుగా అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























