OG డైరెక్టర్ కు బర్త్ డే విషెస్- ఈ ఏడాది పేల్చి పడేద్దాం

og makers blasting birthday wishes to director sujeeth

రన్ ‌రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అయితే సుజీత్ నుండి వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు సుజీత్. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సుజీత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ సుజీత్ కు బ్లాస్టింగ్ బర్త్ డే విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే సుజీత్.. నువ్వు హ్యాపీగా ఉండు.. ఫ్యాన్స్ ను వారి గాడ్ ను ఓజీలో లో ఏ రేంజ్ లో ప్రజెంట్ చేసి వారిని కూడా హ్యాపీగా ఉంచు.. ఈ ఏడాది పేల్చి పడేద్దాం అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =