కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 32

siddharth chinna movie ott release date fixed
ఓటీటీ

చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు.

TFN Adminవాట్సాప్
US Envoy Eric Garcetti Surprises with His Dance For Shah Rukh's Chaiyya Chaiyya Song
సాంగ్

దీపావళి సెలబ్రేషన్స్‌లో.. షారుఖ్‌ సాంగ్‌కు అమెరికా రాయబారి డ్యాన్స్‌, వీడియో వైరల్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో సైతం కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు ఆయన. ఇక షారుఖ్ అభిమానుల్లో సాధారణ ప్రేక్షకులే కాదు, పలువురు ప్రముఖులు కూడా ఉంటారంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియాలో దీపావళి పండుగ సెలబ్రేషన్స్‌ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడివారితో సహా విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi and Venkatesh Condolences To Actor Chandra Mohan's Demise
సినిమా వార్తలు

చంద్రమోహన్ మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఎమోషనల్ ట్వీట్స్

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
jr ntr emotional post on chandra mohan demise
సినిమా వార్తలు

చంద్రమోహన్ మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

తెలుగు సినీ పరిశ్రమ ఈమధ్య కాలంలో ఎంతోమంది లెజెండరీ నటీనటులను కోల్పోయింది. గత ఏడాది అయితే సూపర్ స్టార్ కృష్ణ ను పొగొట్టుకుంది చిత్రపరిశ్రమ. కృష్ణ గారితో పాటు సత్యనారాయణ, చలపతిరావు లాంటి సీనియర్ నటులు సైతం మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ ను కోల్పోయింది టాలీవుడ్. సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా చంద్రమోహన్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందతూ మరణించారు.

TFN Adminవాట్సాప్
Tollywood Senior Actor Chandra Mohan Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. 80 సంవత్సరాల ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
sapta sagaralu dhaati side b title song released
సాంగ్

సప్త సాగరాలు దాటి సైడ్ బి టైటిల్ సాంగ్ రిలీజ్

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
sunil first look poster released from harom hara movie
ఫస్ట్ లుక్

హరోం హర నుండి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఆమధ్య ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది బాగానే ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
balakrishna about bhagavanth kesari hindi release
సినిమా వార్తలు

భగవంత్ కేసరి హిందీ రిలీజ్ పై బాలయ్య క్లారిటీ

హిట్ అయిన సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే మన తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరేదో కాదు రీసెంట్ గా వచ్చి ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఈసినిమా అందరికీ నచ్చడంతో సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
adipurush got solid trp ratings
సినిమా వార్తలు

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ జూన్ లో విడుదలై 500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఇక ఈసినిమా టీవీ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ను స్టార్ మా మొదటి సారి అక్టోబర్ 29న వరల్డ్ ప్రీమియర్ మూవీ గా టెలికాస్ట్ చేయగా 10.6 రేటింగ్స్ ను రాబట్టుకుంది.అజయ్ అతుల్ ఈసినిమాకు సంగీతం అందించగా భూషణ్ కుమార్ ,ప్రసాద్ సుతార్, కృష్ణన్ కుమార్ ,వంశీ ,ప్రమోద్ కలిసి నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
mahesh babu emotional post on krishna statue unveiling
సినిమా వార్తలు

నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి

అలనాటి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో నటనతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపుతెచ్చారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. ఇక గత ఏడాది నవంబర్ 15వ తేదీన ఆయన మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్న దేవినేని అవినాష్ తో కలిసి లోకనాయకుడు కమలహాసన్ ఆవిష్కరించారు.

TFN Adminవాట్సాప్
Brush Vesko song released from nithiins Extra Ordinary Man movie
సాంగ్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- యూత్ ఫుల్ బ్రష్ వేసుకో సాంగ్ రిలీజ్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం మాత్రం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ సరైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Namrata Shirodkar Interesting Comments on Mahesh Babu Character in Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారంలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే? - నమ్రతా శిరోద్కర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం, అలాగే మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె అక్కడ ఒక మీడియా ప్రతినిధితో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు.

Srikanth Mవాట్సాప్
salaar movie tamil nadu release update
సినిమా వార్తలు

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా రిలీజ్ పై పలు రూమర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈసినిమా చెప్పిన తేదీకే అంటే డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Director K Raghavendra Rao Praises Nandamuri Balakrishna in Bhagavanth Kesari Success Meet
సినిమా వార్తలు

బాలయ్య బాబు బాంబ్ లాంటి వాడు - దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్…

Srikanth Mవాట్సాప్
talented hero dhanush to act in maestro ilaiyaraajas biopic
సినిమా వార్తలు

కన్ఫామ్.. ఇళయరాజా బయోపిక్ లో ధనుష్

ఇప్పటి వరకూ ఎన్నో బయోపిక్ లు వచ్చాయి. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో లెజెండ్ బయోపిక్ రాబోతుంది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా ది.

TFN Adminవాట్సాప్
Ulaganayagan Kamal Haasan Unveils Superstar Krishna's Statue at Vijayawada
సినిమా వార్తలు

విజయవాడలో సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌

దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. కాగా నగరంలోని స్థానిక గురునానక్ కాలనీ వద్ద గల కేడీజీవో పార్కులో సూపర్‌స్టార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 10, 2023) కృష్ణ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. నేటి ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ నేత దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం కమల్ హాసన్ సూపర్ స్టార్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Kajal Aggarwal's Satyabhama Teaser Released
ట్రైలర్ & టీజర్

సత్యభామ టీజర్ రిలీజ్.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటన ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'స‌త్య‌భామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కాజ‌ల్‌తో పాటు విలక్షణ నటుడు ప్ర‌కాష్‌రాజ్‌, ట్యాలెంటెడ్ యాక్టర్ న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. వచ్చే ఏడాది సమ్మర్…

Srikanth Mవాట్సాప్
dhanush review on jigarthanda double x movie
సినిమా వార్తలు

జిగర్ తండ డబల్ ఎక్స్ పై ధనుష్ రివ్యూ

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లారెన్స్,ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనే చూడాలి.

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari Success Meet Balakrishna Remembers Director Dasari Narayanarao
సినిమా వార్తలు

దాసరిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన బాలకృష్ణ

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

Srikanth Mవాట్సాప్
indian 2 movie new schedule update
షూటింగ్ అప్‌డేట్

8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్

లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇండియన్ 2, కల్కి2898ఏడీ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా రీసెంట్ గానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఇవి కాకండా ఇంకా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అలానే హెచ్.వినోథ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్