సత్యభామ టీజర్ రిలీజ్.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటన ఎలా ఉందంటే?

Kajal Aggarwal's Satyabhama Teaser Released

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవలే ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం ‘స‌త్య‌భామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కాజ‌ల్‌తో పాటు విలక్షణ నటుడు ప్ర‌కాష్‌రాజ్‌, ట్యాలెంటెడ్ యాక్టర్ న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ దీపావ‌ళి కానుక‌గా శుక్రవారం ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘స‌త్య‌భామ’ టీజ‌ర్‌లో కాజల్ అగర్వాల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఒక మర్డర్ కేసులో ఆమెను పై అధికారులు సస్పెండ్ చేయడంతో టీజర్ మొదలైంది. అయితే దీనిపై ఇన్వెస్టిగేష‌న్‌ ప్రారంభించిన కాజల్, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కాజల్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టినట్లు అర్ధమవుతోంది. ఇప్పటివరకు ఆమె చేసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఇందులో చాలా సీరియస్ రోల్ ప్లే చేసినట్లు కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకి సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. ‘గూఢ‌చారి’ ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ‘ఇండియ‌న్ 2’లో క‌మ‌ల్‌హాస‌న్‌ సరసన హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.