
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 31


యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ

ఆశిష్ వెలమకుచ 3వ చిత్రం లేటెస్ట్ అప్డేట్

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ రెడీ

సైంధవ్ ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్

లాల్ సలామ్ టీజర్ రిలీజ్

పాటల సందడిలో.. నాగార్జున నా సామిరంగా
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'నా సామిరంగా'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ
న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోగా.. ఇప్పుడు ఏడాది చివరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది

రణబీర్ కపూర్ యానిమల్ మూవీ నుండి.. 'నాన్నా నువ్వు నా ప్రాణం' సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా 'యానిమల్' చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.

హనుమాన్ నుండి సాంగ్ రానుంది
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా లోని సూపర్ హీరో హనుమాన్ అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదలచేయనున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. ఈసందర్భంగా విడుదల చేసిన సినిమాలోని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.
పుష్ప 2 గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ తొలిభాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటి హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్…

టైగర్ 3 మొదటి రోజు ఎంత రాబట్టిందంటే
ఈఏడాది పఠాన్,గదర్ 2,జవాన్ సినిమాలు బాలీవుడ్ కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాయి.ఈ మూడు సినిమాలు కలిపి 2500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తాచాటాయి.ఇక హిందీ జవాన్ తరువాత పెద్ద సినిమాగా విడుదలైయింది సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3.ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 94కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి100కోట్లకు దగ్గరలో ఆగిపోయింది.పాజిటివ్ టాక్ రావడం అలాగే నిన్న ఆదివారం దానికి తోడు దీపావళి కావడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.

ఆశిష్ వెలమకుచ 3వ చిత్రం లేటెస్ట్ అప్‌డేట్
టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో ఆశిష్ వెలమకుచ ఒకరు. ఆయన హీరోగా త్వరలోనే కొత్త చిత్రం ప్రారంభం కానుంది. దిల్ రాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆశిష్.. తన తొలి సినిమా 'రౌడీ బాయ్స్'తో యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆశిష్ రెండో సినిమాగా 'సెల్ఫిష్' అనే చిత్రం చేశాడు. ఇందులో బ్లాక్‌బస్టర్ చిత్రం 'లవ్ టుడే'తో యువతరాన్ని ఆకర్షించిన ఇవానా కథానాయికగా చేసింది. కాశీ విశాల్ స్వార్థం చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో ఆశిష్ చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ కొత్త చిత్రంపై ఆసక్తి…

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ రెడీ
మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి పాట టిక్కెట్టే కొనకుండా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సాంగ్ కూడా రెడీ అయిపోయిందట.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసందర్భంగా సినిమా నుండి సిద్దు పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ అప్డేట్ ఇచ్చారు.

చంద్రమోహన్ మృతి.. భావోద్వేగానికి గురైన కమల్ హాసన్
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు.

రవితేజ ‘ఈగల్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా.. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా…

సైంధవ్ ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్
సీనియర్ హీరో వెంకటేష్,హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సైంధవ్.వెంకీకి ఇది 75వ సినిమా.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.చాలా రోజుల తరువాత వెంకీ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.ఇటీవల రిలీజైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి సాంగ్స్ విడుదలకానున్నాయి.అందులో భాగంగా మొదటి పాట రాంగ్ యూసేజ్ ను ఈనెల 21న విడుదలకానుంది.ఈ సందర్భంగా సాంగ్ నుండి వెంకీ స్టెప్ వేసిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' తర్వాత రీసెంట్‌గా చేస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. అగ్ర నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి 'టైటిల్ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు…

సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్‍ఫర్మ్.. ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ గూజ్ బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

లాల్ సలామ్ టీజర్ రిలీజ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో రజనీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.

లూసిఫర్ సీక్వెల్- మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. అందులో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.లూసిఫర్‘ చిత్రంతో దర్శకుడిగా మారాడు మరో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్2ఇ: ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

కోట బొమ్మాళి టైటిల్ సాంగ్ రిలీజ్
ఈమధ్య కాలంలో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగులోకి ఎక్కువ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిదే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీమేక్ అయి రిలీజ్ కు సిద్దమవుతుంది. నాయట్టు సినిమా మలయాళంలో ఎంత సూపర్ హిట్ అయిందో చూశాం. ఇక ఈసినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అయింది. కోట బొమ్మాళి పీఎస్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది.

సింహాద్రి వల్ల డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా -హాయ్ నాన్న డైరెక్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ సింహాద్రి తనను సినిమాలవైపు మళ్లేలా చేసిందని హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తెలిపాడు.న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈసినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్ 8న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శౌర్యవ్ ను డైరెక్టర్ గా మారడానికి ఎక్కువ ప్రభావం చూపిన సినిమా ఏదని అడుగగా దానికి అతను సింహాద్రి అంటూ చెప్పుకొచ్చాడు.అలాగే హాయ్ నాన్న మంచి విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు ఈ…

మంగళవారంలో ఆ సాంగ్ ఉండదట
ట్రైలర్ తో మంచి బజ్ ను క్రీయేట్ చేయగలిగింది మంగళవారం అనే సినిమా.ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న సినిమా ఇది.థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు.పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా నటించింది.ఆర్ ఎక్స్ 100లో బోల్డ్ గా కనిపించిన పాయల్ ఈసినిమాలో మరింతగా రెచ్చిపోయిందట.ఇక ఈసినిమానుండి ఇటీవల ఓసాంగ్ ను రిలీజ్ చేశారు.యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసాంగ్ లో కనిపించాడు.అదే అప్పడప్పడ తాండ్ర సాంగ్.యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ ను రాబట్టుకుంది.అయితే ఈ సాంగ్ థియేట్రికల్ వెర్షన్ లో ఉండదట.ఈవిషయాన్ని అజయ్ భూపతి వెల్లడించాడు.

చంద్రమోహన్ మృతి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

గేమ్ ఛేంజర్- ఫ్యాన్స్ కు నిరాశ.. జరగండి సాంగ్ పోస్ట్ పోన్
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. రామ్ చరణ్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ దీపావళి కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జరగండి అంటూ ఈపాట వస్తుంది. ఇక పోస్టర్లు కూడా కలర్ ఫుల్ గా ఉండటంతో ఈపాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ కు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈపాట రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ పాట రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని ఆడియో డాక్యుమెంటేషనన్ ఇష్యూస్ వల్ల ఈపాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే అప్…