దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. కాగా నగరంలోని స్థానిక గురునానక్ కాలనీ వద్ద గల కేడీజీవో పార్కులో సూపర్‌స్టార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 10, 2023) కృష్ణ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. నేటి ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ నేత దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం కమల్ హాసన్ సూపర్ స్టార్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్‌లో భాగంగా విజయవాడలో ఉన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా సూపర్‌స్టార్ కృష్ణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. కాగా కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఇక గతేడాది నవంబర్ 15న ఆయన కన్నుమూసిన విషయం గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయన నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగున్నారు. కాగా మరో వారం రోజుల్లో కృష్ణ తొలి వర్ధంతి జరగనున్న నేపథ్యంలో.. ఆయన విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడం పట్ల ఘట్టమనేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 2’ సహా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’.. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తోన్న ‘కల్కి 2898AD’ తదితర సినిమాలలో నటిస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వీటితో పాటుగా ‘లియో’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్ 2’ మరియు హెచ్ వినోద్ దర్శకత్వంలో ‘KH 233’ వంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: