కన్ఫామ్.. ఇళయరాజా బయోపిక్ లో ధనుష్

talented hero dhanush to act in maestro ilaiyaraajas biopic

ఇప్పటి వరకూ ఎన్నో బయోపిక్ లు వచ్చాయి. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో లెజెండ్ బయోపిక్ రాబోతుంది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా ది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇళయరాజా పాత్రలో ధనుష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఇది కన్ఫామ్ అయిపోయింది. కనెక్ట్ మీడియా ఇంకా మెర్క్యూరీ గ్రూప్ వారు సంయుక్తంగా కలిసి పలు భారీ సినిమాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఇందులో మొదటిగా రాబోతున్న సినిమా ఇళయరాజా బయోపిక్ సినిమా. ఇక ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు ధనుష్ ఇళయరాజా పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను 2024లో ప్రారంభించి 2025 లో రిలీజ్ చేయాలన్న సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ బయోపిక్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఇంకా ఈసినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇళయరాజా బయోపిక్ అందులోనూ ధనుష్ హీరో అంటే ఇప్పటి నుండే సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది.

దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సేవలు అందిస్తున్నారు ఇళయరాజా. ఇప్పటివరకూ 1000 పైగా సినిమాల్లో 7000 కు పైగా సాంగ్స్ ని చేశారు. 50 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో అవార్డులు సైతం దక్కించారు. అంతేకాదు అత్యంత ప్రముఖమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు సైత అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =