కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 30

prabhas salaar movie ap release details
సినిమా వార్తలు

సలార్ ఏపీ రిలీజ్ వివరాలు

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
karthik raju atharva movie trailer out now
ట్రైలర్ & టీజర్

అథర్వ ట్రైలర్ రిలీజ్

అన్ని వర్గాల వారికి ఇష్టమైన జోనర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈమధ్య కాలంలో ఆ జోనర్ లలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇదే జోనర్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu and Namrata Shirodkar Pay Grand Homage To Superstar Krishna Garu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి.. మహేష్ బాబు, నమ్రత ఘన నివాళులు

దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ తొలి వర్ధంతి నేడు (నవంబర్ 15, 2023). ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహేష్, నమ్రతలు కృష్ణ, ఇందిరా దేవి దంపతుల ఫోటోల వద్ద పువ్వులు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వారి పిల్లలు గౌతమ్ మరియు సితార ఇరువురూ తమ తాతకు నమస్కరించి అంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "సూపర్ స్టార్ ఆల్వేస్ అండ్ ఫరెవర్" అని…

Srikanth Mవాట్సాప్
Aadikeshava Movie trailer Release Date fixed
ట్రైలర్ & టీజర్

ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ వల్ల రిలీజ్ డేట్ మార్చారు. ఫైనల్లీ నవంబర్ 24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

TFN Adminవాట్సాప్
Tollywood Star Venkatesh Meets Viv Richards at Mumbai During Ind vs NZ 1st Semi-final Match
సినిమా వార్తలు

వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌తో వెంకటేష్ సెల్ఫీ

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ స్వతహాగా నటుడైనప్పటికీ.. ఆయనకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. అందునా ముఖ్యంగా క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఆయనకు. అందుకే భారత్ జట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కోసారి ఇతర దేశాలకు సైతం వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టోర్నీ ప్రస్తుతం లీగ్ దశ పూర్తయ్యి కీలకమైన నాకౌట్ స్టేజ్‌కి చేరుకుంది. ఇక ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లలో అదరగొట్టిన భారత్ నాకౌట్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. దీనిలో భాగంగా…

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Dances To Jawan Song in Diwali Party, Video Goes Viral
సాంగ్

షారుఖ్ పాటకి మెగాస్టార్ స్టెప్పులు, వీడియో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్‍ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి పండుగ సందర్భంగా గత శనివారం రాత్రి తమ నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ ముద్దులపట్టి క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో వారు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్‌బాబు-నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌-ప్రణతి దంపతులు ఉన్నారు. అలాగే వీరితోపాటు మరికొందరు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
rajinikanth praises on jigarthanda doublex movie team
సినిమా వార్తలు

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీమ్ పై తలైవా ప్రశంసలు

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ జిగర్ తండ డబుల్ ఎక్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతంచేసుకుంది. ఇక ఈసినిమాపై తలైవా రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించారు. జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ డిఫరెంట్ కథ, డిఫరెంట్ ప్లాట్.. కార్తీక్ సుబ్బరాజు అమేజింగ్ వర్క్ చేశావు.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఇంతకుముందు సినిమా ఫ్యాన్స్ ఎప్పుడూ చూసినట్టు ఉండవు.. ఇక ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో చేసిన రాఘవ లారెన్స్ అలానే ఎస్ జే సూర్య నటనను కూడా ప్రశంసించారు. ఈ రకమైన పాత్రలో…

TFN Adminవాట్సాప్
sai dharam tej about question and answer about tollywood celebrities
సినిమా వార్తలు

సమంత, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి తేజ్ మాటల్లో

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సినిమా గాంజా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
rakshit shetty about tollywood star heroes
సినిమా వార్తలు

స్టార్ హీరోలతో అలాంటి జోనర్లలో సినిమాలు తీస్తా

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.

TFN Adminవాట్సాప్
sai dharam tej about mass films
సినిమా వార్తలు

మాస్ సినిమాలు నా ఫేవరెట్ జోనర్

సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్
Mangalavaaram will have a sequel as well.
సినిమా వార్తలు

మంగళవారంకు సీక్వెల్ కూడా

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు సీక్వెల్స్ కామన్ అయిపోయాయి.రిజల్ట్ తో సంబంధం లేకుండా సీక్వెల్ కూడా ఉందంటూ ముందే చెప్పేస్తున్నారు.ఈ జాబితాలో మరో సినిమా చేరింది అదే మంగళవారం.ఆర్ ఎక్స్ 100ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.ఈవారం మంచి హైప్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Mahender Reddyవాట్సాప్
childrens day special poster released from saindhav movie
ఫస్ట్ లుక్

సైంధవ్- చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
hanuman movie first single released
సాంగ్

హనుమాన్ నుండి సూపర్ హీరో హనుమాన్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అ!, కల్కి, జాంబిరెడ్డి ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

TFN Adminవాట్సాప్
tiger 3 two days collections
బాక్సాఫీస్

రెండో రోజు టైగర్ 3 కి షాకింగ్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నిన్న కొన్ని చోట్ల సెలువు కూడా కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు ఇండియాలో 43కోట్ల నెట్ ను రాబట్టిన ఈసినిమా రెండో 58కోట్లతో రెండు రోజుల్లోనే 101 కోట్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Ranbir Kapoor and Animal Movie Team Meet Nandamuri Balakrishna
సినిమా వార్తలు

అద్దిరిపోయే న్యూస్.. బాలకృష్ణ షోలో యానిమల్ టీమ్ సందడి

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా 'యానిమల్' చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
800 movie ott release date fixed
ఓటీటీ

800 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే కదా. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈమధ్యే ఈసినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ ను రాలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోని తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Vennela Kishore's First Look Released From Chaari 111 Movie
ఫస్ట్ లుక్

చారి 111గా.. జేమ్స్ బాండ్‌ లుక్‌లో వెన్నెల కిశోర్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ స్పై గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

Srikanth Mవాట్సాప్
Appadappada Thaandra video song out from Mangalavaaram movie
సాంగ్

మంగళవారం- అప్పడప్పడ తాండ్ర వీడియో సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Nandamuri Chaitanya Krishna Breath trailer out now
ట్రైలర్ & టీజర్

ఇంటెన్స్ ఎమోషన్స్ తో బ్రీత్ ట్రైలర్

సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అంటే కామన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఎంతో మంది వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక నందమూరి తారకరామారావు వారసత్వంతో కూడా ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. రామారావు తరువాత హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరూ అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోలయ్యారు.

TFN Adminవాట్సాప్
Jr NTR's Devara Movie New Schedule Begins From Today
షూటింగ్ అప్‌డేట్

నేటి నుండి దేవర కొత్త షెడ్యూల్ షురూ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే పలు…

Srikanth Mవాట్సాప్

షేర్