
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 162


రిలీజ్ అయిన రష్మిక మిషన్ మజ్ను హిందీ మూవీ ట్రైలర్

ఆస్కార్ బరిలో కాంతార

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్

సీక్వెల్ గా విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ?

నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్

ఐ యామ్ బ్యాక్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

కళ్యాణం కమనీయం రిలీజ్ లో మార్పు లేదు

వారసుడు మూవీ సెన్సార్ పూర్తి

సెన్సార్ పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి

నయనతార రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

సెన్సార్ పూర్తిచేసుకున్న కళ్యాణం కమనీయం

11 భాషల్లో హనుమాన్ రిలీజ్

హంట్ మూవీ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్

మారిన వారసుడు మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్

ధమాకా సక్సెస్ జోష్‌లో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ, గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.
ఇండియాలో ఇండస్ట్రీ హిట్ గా హాలీవుడ్ మూవీ అవతార్ 2
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

రిలీజ్ అయిన రష్మిక మిషన్ మజ్ను హిందీ మూవీ ట్రైలర్
ఆర్ ఎస్ వి పి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై శాంతను బాఘ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా, రష్మిక జంటగా 1971ఇండియా- పాకిస్తాన్ వార్ సమయంలో నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20 వ తేదీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆస్కార్ బరిలో కాంతార
సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఇక ఇప్పుడు మరో సౌత్ సినిమా కూడా ఆస్కార్ బరిలో స్థానం దక్కించుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఈమధ్య కాలంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన కాంతార సినిమా. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేశారు. అన్ని చోట్లా విజయం సాధించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సీక్వెల్ గా విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ?
రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్…

నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్లు రావడం కామన్ గా ఉండేదే. ఇక సెలబ్రిటీలు కూడా వారి కామెంట్లపై స్పందించాలి అనుకుంటే స్పందిస్తారు.. లేకపోతే లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం ధీటుగానే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంతకు అయితే ఇది ఎప్పుడూ ఉండేదో. నెటిజెన్ల కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటుంది సమంత. ఇక తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సామ్. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగానే నిన్న శాకుంతలం ట్రైలర్ ను…

ఐ యామ్ బ్యాక్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువవడంతో నభాకు అవకాశాలు తగ్గి ఉండొచ్చు అన్న వార్తలు కూడా వచ్చాయి. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేసింది. అయితే చాలా రోజుల తరువాత నభా తన సోషల్ మీడియా ద్వారా తన బ్రేక్ కు కారణం ఏంటో చెబుతూ…

అన్ స్టాపబుల్ 2 షో తెర వెనుక బాలకృష్ణ , ప్రభాస్, గోపీచంద్ సందడి వీడియో రిలీజ్
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయడానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుని, 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

కళ్యాణం కమనీయం రిలీజ్ లో మార్పు లేదు
సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా వరకూ పెద్ద హీరోల సినిమానే సంక్రాంతి బరిలోకి పోటీకి దిగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పలువురు పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అందులో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అజిత్ నటించిన తునివు ఇంకా విజయ్ నటించిన వారసుడు సినిమాలు ఉన్నాయి. అందుకే దాదాపు చిన్న సినిమాలు సంక్రాతిని లైట్ తీసుకుంటాయి. కానీ అన్ని పెద్ద సినిమాలు ఉన్నా కానీ ఏమాత్రం లెక్కచేయకుండా ఒక చిన్న సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణం కమనీయం.

రిలీజ్ అయిన వీరసింహారెడ్డి నాల్గవ సింగిల్ మాస్ మొగుడు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత…

వారసుడు మూవీ సెన్సార్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీన, హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

గూఢచారి సీక్వెల్ నుండి సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈఏడాది గూఢచారి సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రీ-విజన్ వీడియోను నేడు విడుదల చేశారు. శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం వీడియోలో కనిపిస్తుంది. శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్…

సెన్సార్ పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో, టీజర్, సాంగ్స్‌కు సూపర్ స్పందన వస్తోంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమాలోని డైలాగ్స్ ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగాఈ సినిమా సెన్సార్ పనులు…

ఆధ్యాత్మిక భావనలో న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పిన సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

నయనతార రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
మనసునక్కరే ( 2003) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నయనతార అయ్య(2005)మూవీతో కోలీవుడ్, లక్ష్మీ(2006)మూవీతో టాలీవుడ్, సూపర్(2010) మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ప్రస్తుతం ఇరైవన్ తమిళ మూవీ లో నటిస్తున్నారు. జవాన్ మూవీతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న కళ్యాణం కమనీయం
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో పెళ్లి నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు.

11 భాషల్లో హనుమాన్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను…

హంట్ మూవీ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ సూరపనేని దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హంట్ మూవీ జనవరి 26 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ కీలక పాత్రల్లో నటించారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. ది చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మారిన వారసుడు మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ 11 వ తేదీ, హిందీ వెర్షన్ 13 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే…