నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్

Samantha Strong Reply To Netizen,Samantha Shared Emotional Post About Her Health,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha,Samantha Movies,Samantha New Movies,Samantha Latest Movies,Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Samantha New Movie News,Samantha Latest Movie News,Actress Samantha,Heroine Samantha,Samantha Photos,Samantha New Post,Samantha Latest Post,Samantha Ruth Prabhu,Samantha Strong Reply,Shaakuntalam Official Trailer,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Trailer,Shaakuntalam Movie Trailer,Shaakuntalam Movie Updates

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్లు రావడం కామన్ గా ఉండేదే. ఇక సెలబ్రిటీలు కూడా వారి కామెంట్లపై స్పందించాలి అనుకుంటే స్పందిస్తారు.. లేకపోతే లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం ధీటుగానే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంతకు అయితే ఇది ఎప్పుడూ ఉండేదో. నెటిజెన్ల కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటుంది సమంత. ఇక తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సామ్. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగానే నిన్న శాకుంతలం ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గత కొద్దిరోజులుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణం చేత తను చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా కాలంగా బయటకు కూడా రావడంలేదు. అయితే కాస్త కోలుకోవడంతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చారు. ఇక ఈ వేడుక వచ్చిన సమంత ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఓ ట్విట్టర్ ద్వారా సమంత ఫొటోలు పోస్ట్ చేస్తూ.. సమంతను చూస్తుంటే బాధేస్తోంది. ఆమెలో ఇదివరకటి అందం, మెరుపు కనిపించలేదు. విడాకుల డిప్రెషన్‌ నుంచి కోలుకుని.. సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్న సామ్‌ను మయోసైటిస్‌ దెబ్బతీసింది. మళ్లీ బలహీనురాలిని చేసింది అంటూ కామెంట్లు చేశారు. ఇక దీనిపై తనదైన శైలిలో స్పందించింది సామ్. ‘నాలాగా నెలలతరబడి చికిత్స, మెడిసిన్‌ తీసుకునే పరిస్థితి నీకు రాకూడదని ప్రార్థిస్తున్నా. నువ్వు వెలిగిపోవాలని ప్రేమతో కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ఇక ప్రస్తుతం సమంత తెలుగులో చేసిన శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. దీనిలో పాటు విజయ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + sixteen =