శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ 11 వ తేదీ, హిందీ వెర్షన్ 13 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Vaarasudu will arrive in theaters on January14th
Celebrate Sankranthi in theaters with your family#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @scolourpencils @vaishnavi141081 @Yugandhart_ @PVPCinema pic.twitter.com/wIfOQ6tOLe
— Sri Venkateswara Creations (@SVC_official) January 9, 2023
ముందుగా వారసుడు మూవీ తెలుగు, తమిళ భాషలలో జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాలతో తెలుగు వెర్షన్ వారసుడు విడుదల వాయిదా పడింది. తాజాగా వారసుడు మూవీ 14 వ తేదీ రిలీజ్ కానున్నట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వారసుడు మూవీ థియేటర్స్ లో జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుందనీ , థియేటర్స్ లో మీ కుటుంబాలతో సంక్రాంతి పండగను సెబ్రేట్ చేసుకోండనీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: