విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాదు ఈసినిమాను 11 బాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అందులో కొరియన్, జపనీస్, ఇంగ్లీష్, స్పానీష్, చైనీస్ భాషలు కూడా ఉన్నాయి. కంటెంట్ మీదున్న నమ్మకంతో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
This Summer!
The whole world will witness the Most Powerful Super Hero 😎#HanuMan ❤️🔥
Grand PAN WORLD RELEASE
in 11 languages on MAY 12th 2023🤩– https://t.co/rP3meqLWxe#HanuManFromMay12th💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #SuperHeroHanuMan pic.twitter.com/gfaOZpMx0V— Primeshow Entertainment (@Primeshowtweets) January 9, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: