సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా వరకూ పెద్ద హీరోల సినిమానే సంక్రాంతి బరిలోకి పోటీకి దిగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పలువురు పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అందులో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అజిత్ నటించిన తునివు ఇంకా విజయ్ నటించిన వారసుడు సినిమాలు ఉన్నాయి. అందుకే దాదాపు చిన్న సినిమాలు సంక్రాతిని లైట్ తీసుకుంటాయి. కానీ అన్ని పెద్ద సినిమాలు ఉన్నా కానీ ఏమాత్రం లెక్కచేయకుండా ఒక చిన్న సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణం కమనీయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ఇక సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ రిలీజ్ పై పలు వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం వారసుడు రిలీజ్. వారసుడు సినిమా రిలీజ్ డేట్ ను జనవరి 14వ తేదీకి మార్చారు. దీంతో కళ్యాణం కమనీయం సినిమా రిలీజ్ ను మార్చే అవకాశం ఉందన్న వార్తలు మొదలయ్యాయి. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని జనవరి14 వ తేదీనే ఈసినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. మరి చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో..
కాగా ఈసినిమాలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కార్తీక్ ఘట్టమనేని, సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: