ఆస్కార్ బరిలో కాంతార

Rishab Shettys Kantara Movie Qualified Two Categories In Oscar Awards, Kantara Movie Qualified Two Categories In Oscar Awards, Two Categories In Oscar Awards, Kantara Movie In Oscar Awards, Kantara Oscar Awards, Oscar Awards, 2023 Oscar Awards, Oscar Awards 2023, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Achyuth Kumar, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఇక ఇప్పుడు మరో సౌత్ సినిమా కూడా ఆస్కార్ బరిలో స్థానం దక్కించుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఈమధ్య కాలంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన కాంతార సినిమా. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేశారు. అన్ని చోట్లా విజయం సాధించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా పలు రికార్డులను సొంతం చేసుకోగా ఇప్పుడు మరో సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఈసినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించి ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార సినిమా 95ఆస్కార్ కు నామినేట్ అయిందని చిత్రయూనిట్ తెలిపింది.

కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =