టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువవడంతో నభాకు అవకాశాలు తగ్గి ఉండొచ్చు అన్న వార్తలు కూడా వచ్చాయి. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేసింది. అయితే చాలా రోజుల తరువాత నభా తన సోషల్ మీడియా ద్వారా తన బ్రేక్ కు కారణం ఏంటో చెబుతూ షాకిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నభా నటేష్ తన ఇన్ట్సా ద్వారా నేను గత ఏడాది సినిమాలు చేయలేదు. నాకు లాగే మీకు కూడా నన్ను మిస్ అయి ఉంటారని నాకు తెలుసు. 2022లో నేను ఒక ప్రమాదానికి గురయ్యాను. నా ఎడమ భుజం మల్టీ ఫ్రాక్చర్స్ కి గురైంది. చికిత్స లో భాగంగా పలుమార్లు సర్జరీలు చేయించాల్సి వచ్చింది. ఈ పరిణామం మానసికంగా, శారీరకంగా బాధించింది. అయితే ఇప్పుడు నేను కోలుకున్నాను. నేను ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో నటించాలి అనుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో నేను రికవరీ అయ్యాను. నా ఆరోగ్యం ప్రస్తుతం కుదురుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను 2023 అంటూ పోస్ట్ లో పేర్కొంది. చూద్దాం మరి ఈ ఏడాది నభా వరుస అవకాశాలను దక్కించుకొని కెరీర్ లో మళ్లీ దూసుకుపోతుందేమో..
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: