టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 2023 శుభారంభం

Tollywood Industry Started 2023 With Two Blockbuster Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2023,2023 Telugu Movies,New Telugu Movies 2023,Latest Telugu Movies 2023,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Movie Updates,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Chiranjeevi Waltair Veerayya Movie Latest Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Waltair Veerayya,Megastar Chiranjeevi,Veera Simha Reddy,Nandamuri Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వీర సింహారెడ్డి మూవీ 19 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 132 కోట్ల గ్రాస్ , 79 కోట్ల షేర్ తో దూసుకుపోతూ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీ 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 215 కోట్ల గ్రాస్ , 126 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఈ రెండు సినిమాలు ప్రాఫిట్ తో దూసుకుపోతూ టాలీవుడ్ లో 2023 సంవత్సరానికి శుభారంభం చేశాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − eight =