తమిళ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈఏడాది సంక్రాంతికి వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. జనవరి 2 నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో భాగమవుతున్నాడు. ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో కాదు కె.జి.యఫ్ 2లో విలన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా గురించి సంజయ్ దత్ మాట్లాడుతూ.. నేను దళపతి 67 సింగిల్ లైన్ విన్న వెంటనే ఇలాంటి సినిమాలో భాగం అయ్యేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. ఈ సినిమా ప్రయాణం షురూ చేసేందుకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది అంటూ తెలిపాడు.
ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: