రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ తో దేశవ్యాప్తంగా వీరు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ను కూడా గత తీసి గత ఏడాది రిలీజ్ చేశారు. సమంత ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో చేసి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈదర్శక ద్వయం-సమంత మరోసారి కలసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడో వచ్చింది. అయితే ఈమధ్యనే షూటింగ్ మొదలైంది. సమంత ఇప్పటివరకూ పలు సినిమాలతో బిజీగా ఉండటం.. మరోవైపు తన అనారోగ్య పరిస్థుతుల వల్ల తను షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో సమంత కూడా పాల్గొందని..షూటింగ్ జరుగుతుందని తెలిపారు. కాగా స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో రానుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇక్కడ మరోవైపు ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా చేస్తున్నారు. అయితే ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పని చేస్తున్నారు. ఇక్కడ ఈమధ్యనే షూటింగ్ ను మొదలుపెట్టారు.
Super excited to team up with this powerhouse once again! Welcome @Samanthaprabhu2 to the world of Citadel!
Now filming 🎬@Varun_dvn #RussoBrothers @MenonSita @d2r_films @agbo_films @PrimeVideoIN @AmazonStudios pic.twitter.com/yuoigSDiTd— Raj & DK (@rajndk) February 1, 2023




ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























