కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అమిగోస్- ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రిలీజ్

enno ratrulosthayi song out from amigos movie
సాంగ్2 ని. చదువు

అమిగోస్- ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రిలీజ్

Enno Ratrulosthayi Song Out from Amigos Movie

enno ratrulosthayi song out from amigos movie

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఎన్నో రాత్రులొస్తాయికానీ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే తారకరత్న అస్వస్థతకు గురైన కారణంతో ఈపాట రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్పీ చరణ్, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కల్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ పై ఈ పాటను అందంగా చిత్రీకరించగా అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా ఈపాట బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ఎన్నో రాత్రులొస్తాయి కానీ పాటకు రీమిక్స్ అన్న సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్