పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోల ఏ అప్ కమింగ్ మూవీ కి మీ ఓటు ?

Poll Game: For Which Upcoming Movies You Are Eagerly Waiting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Upcoming Movies,TFN POLL,Poll Game,Keerthy Suresh,Chiranjeevi,Bholaa Shankar,Meher Ramesh,Anil Sunkara,Mahathi Swara Sagar,Adipurush,Prabhas,Hari Hara Veera Mallu,Pawan Kalyan,NBK108,SSMB28,Dasara,Dasara Movie,Upcoming Movies 2023,Telugu Upcoming Movies 2023,Tollywood Upcoming Movies 2023

భోళా శంకర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహెర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ వేదాళం తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిపురుష్:టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. కృతి సనన్ కథానాయిక. అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

హరిహర వీరమల్లు : మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

NBK108 : బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

SSMB 28 :వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దసరా : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్, పాన్ ఇండియా దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోల ఏ అప్ కమింగ్ మూవీ కి మీ ఓటు ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =