మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పార్ట్ 2 కోసం. దాదాపు షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈపార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్టును మించిన విజువల్స్ తో ఈ పార్ట్ 2 ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సెకండ్ పార్ట్ ను ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పొన్నియిన్ సెల్వన్ 1 కూడా ఇదే ఫార్మాట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Immerse yourself into the world of #PS once again in the grandeur of @IMAX! 🤩
Come live this epic experience in IMAX THEATERS worldwide from April 28 🔥#PS2 #PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @PrimeVideoIN pic.twitter.com/jOIvbpS71U
— Lyca Productions (@LycaProductions) January 31, 2023
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా..? లేదంటే.. కొత్త వారు ఎవరైనా యాడ్ అవుతారా..? అనేది తెలియాలి.. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























