సందీప్ కు అదృష్టం కూడా తోడుకావాలి

Natural Star Nani Interesting Speech At Michael Movie Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Update,Michael Updates,Michael Movie Updates,Michael Movie Update,Michael Movie Latest Updates,Michael Movie Latest Update,Michael Latest Update,Michael Latest Updates,Michael Telugu Movie Latest Updates,Michael Movie News,Michael Telugu Movie Latest News,Michael Movie Latest News,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Sundeep Kishan Upcoming Movie,Sundeep Kishan Latest News,Sundeep Kishan Michael,Sundeep Kishan Michael Movie,Sundeep Kishan Michael Movie Latest Updates,Michael Movie Pre Release Event LIVE,Michael Movie Pre Release Event,Michael Pre Release Event,Michael Pre Release,Michael Movie Pre Release,Nani Speech At Michael Movie Pre Release Event,Nani Speech,Natural Star Nani,Nani,Michael Trailer,Michael Movie Trailer,Michael Telugu Movie Trailer

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, ప్యాషన్ తో పాటు అదృష్టం కూడా తోడుండాలి. అదృష్టం అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ అదృష్టం లేక ఎంతో మంది హీరోలు ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక అలాంటి వారిలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా ఎందుకో సాలిడ్ హిట్ అనేది కొట్టలేకపోతున్నాడు. చేయడానికి విభిన్నమైన కథలను చేస్తున్నా సక్సెస్ రావడంలేదు. అందుకే తనకు అదృష్టం కూడా తోడుకావాలి అని కోరుకుంటున్నాడు హీరో నాని. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ మాల్ లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మా సినిమాలు వచ్చేవరకూ ఆగకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కి రాకపోతే ఈలలు, సౌండ్స్, ఎఫెక్షన్ మిస్ అవుతుంటానని అనిపిస్తూ ఉంటుంది. ఇక మైఖేల్ సినిమాలోని ఆర్టిస్టుల గెటప్పులు, కాస్ట్యూమ్స్, పెర్ఫామెన్స్ చూస్తుంటే, ఏదో ఒక కొత్త ఒరవడి మొదలవుతుందని మాత్రం అనిపిస్తోంది. ‘శివ’ వచ్చినప్పుడు అన్ని అంశాల్లో చాలా కొత్తగా అనిపించింది. అలాంటి ఒక సినిమాగా ‘మైఖేల్’ నిలవాలని నేను కోరుకుంటున్నాను.. సందీప్ కిషన్ లో ఇంతకాలంగా కష్టం, టాలెంట్ కనిపించాయి.. అదృష్టం మాత్రం కనిపించలేదు.. అదృష్టమనేది ఈ సినిమాతో యాడ్ అవుతుందని నేను భావిస్తున్నాను. కొత్త టోన్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు నాని.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + six =