
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 147


స్టైలిష్ లుక్ లో అనుపమ పరమేశ్వరన్

సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ

ధమ్కీ రిలీజ్ డేట్ వాయిదా
షూటింగ్ చివరి దశలో సలార్

కాంతార2 మూవీ అప్ డేట్

300 కోట్ల క్లబ్ లో వారిసు మూవీ

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆదిపురుష్ మూవీ పై కృతి సనన్ స్పందన

తాతగారి ఆసినిమాలు రీమేక్ చేయాలని ఉంది

25 రోజులు పూర్తిచేసుకున్న వాల్తేరు వీరయ్య

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రోమో వీడియో పై సమంత కామెంట్

వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం సుప్రీమ్ హీరో

మేకర్స్ కు రైటర్ పద్మభూషణ్ సాలిడ్ ప్రాఫిట్స్
ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమా చూసే విధానం మారిపోయిందని చెప్పొచ్చు. అందుకే సినిమాలు తీయడంలో మేకర్స్ కూడా తమ పంథాను మార్చేశారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత మారిపోయిందో. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడటం లేదు. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్లును అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు రైటర్ పద్మభూషణ్.

మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన వసంత కోకిల మూవీ ట్రైలర్
ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా , కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ వసంత ముల్లై తమిళ మూవీ ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , కన్నడ వెర్షన్స్ వసంతకోకిలా టైటిల్ తో 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి.నలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ వసంతకోకిల`టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఇప్పటికేచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

స్టైలిష్ లుక్ లో అనుపమ పరమేశ్వరన్
బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన అనుపమ సూపర్ హిట్ అ ఆ మూవీ తో టాలీవుడ్ , సూపర్ హిట్ కొడి మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. నటసార్వభౌమ మూవీ తో అనుపమ శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా అనుపమ కొనసాగుతున్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన కార్తికేయ 2 , 18 పేజెస్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు తో సిద్దు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. సిద్దుతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దూ డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అనుపమా పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

ధమ్కీ రిలీజ్ డేట్ వాయిదా
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే పోస్టర్లు, పాటలను రిలీజ్ చేసింది. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. నిజానికి ఈసినిమాను ఈనెలలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు చిత్రయూనిట్. అయితే ఈసినిమా పనులు ఇంకా పూర్తవకపోవడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు ఇంకా పూర్తవకపోవడంతో.. సీజీ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుండటంతో ఈసినిమా…
షూటింగ్ చివరి దశలో సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. ఇక తాజా సమాచరం ప్రకారం ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది. ఆఖరి షెడ్యూల్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నారట. ఇక ఈషూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొని షూటింగ్ ను పూర్తిచేయనున్నాడట. ఈ నెల చివరి వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

కాంతార2 మూవీ అప్ డేట్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

300 కోట్ల క్లబ్ లో వారిసు మూవీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆదిపురుష్ మూవీ పై కృతి సనన్ స్పందన
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

తాతగారి ఆసినిమాలు రీమేక్ చేయాలని ఉంది
రీమేక్ సినిమాలు తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒకనాటి క్లాసిక్ సినిమాలు రీమేక్ చేయడం అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తన తాత సినిమాలను రీమేక్ చేయాలని ఉందంట. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్…

25 రోజులు పూర్తిచేసుకున్న వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నిజానికి సంక్రాంతి బరిలో దిగిన అన్ని సినిమాలకంటే కూడా ఈసినిమా ఎక్కువ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ మాత్రమే కాదు ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈసినిమా తాజాగా 25 రోజులు…

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

రిలీజ్ అయిన జైలర్ మూవీ జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. జైలర్ మూవీలో సునీల్ విలన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మైథలాజికల్ టచ్‌తో అశోక్ గల్లా రెండవ మూవీ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి పద్మావతి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అమెరికాలో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్న అశోక్ ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గల్లా అశోక్ కొత్త సినిమా ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు వెంకటేష్‌తో పాటు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకుడు బోయపాటి శ్రీను గెస్ట్‌లుగా హాజరయ్యారు.

ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్ లవ్‌స్టోరీల తర్వాత హీరో నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.య కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇకఇటీవలే మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్.

ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రోమో వీడియో పై సమంత కామెంట్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం సుప్రీమ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సస్పెన్స్, లవ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని టీజర్లో చూపించారు.

పాత బస్తీ లో RC15 సాంగ్ షూటింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.