టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సస్పెన్స్, లవ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని టీజర్లో చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ రాబోతుంది.ఇక ఈ ట్రైలర్ ను ఒక మెగా హీరో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ మెగా హీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్రబృందం ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఈ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ట్రైలర్ ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Everyone’s 𝐒𝐔𝐏𝐑𝐄𝐌𝐄 Favourite 🔥@IamSaiDharamTej to grace the trailer launch event of #VinaroBhagyamuVishnuKatha on 𝐅𝐄𝐁 𝟕𝐭𝐡 @ 𝟓:𝟎𝟒 𝐏𝐌 ✨#SDTForVBVK #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @adityamusic pic.twitter.com/xOueD7lMRl
— GA2 Pictures (@GA2Official) February 6, 2023
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. మురళీ శర్మ, ప్రవీణ్, ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: