300 కోట్ల క్లబ్ లో వారిసు మూవీ
Vijay Varisu Movie Collected 300 Crore at Box Office

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.
విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారిసు తమిళ మూవీ , తెలుగు వెర్షన్ వారసుడు మూవీస్ బ్రేక్ ఈవెన్ సాధించాయి. వారిసు తమిళ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి 300కోట్ల క్లబ్ లో చేరినట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దళపతి విజయ్ సినీ కెరీర్ లో ఈ మూవీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.








