
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 146


జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియో

బెదురులంక 2012- టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న పాప్ కార్న్

రామోజీ ఫిల్మ్ సిటీ లో చంద్రముఖి 2

నన్ను కంగారు పెట్టేది అదే

జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?

#NBK 108 మూవీ షూటింగ్ అప్ డేట్

పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

నెగిటివిటీపై రష్మిక రియాక్షన్

అమిగోస్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్

మరోసారి శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా

#RAPO 20 మూవీ లో విలన్ గా హీరో ప్రిన్స్ ?

దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్
గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో .. ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియో
సూపర్ హిట్ ధడక్ మూవీతో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి, గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్, Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ షో
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్
గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడే తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళాశంకర్. మేకర్ మెహర్ రమేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

బెదురులంక 2012- టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 2012 యుగాంతం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రబృందం. ఈసినిమా టీజర్ ను…

సెన్సార్ పూర్తిచేసుకున్న పాప్ కార్న్
ఈమధ్య హీరోయిన్లు గా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమ అదృష్టాన్ని నిర్మాణరంగంలో కూడా పరీక్షించుకుంటున్నారు. ఇక ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అవికా గోర్. సాయి రోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. లిఫ్ట్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం…

రామోజీ ఫిల్మ్ సిటీ లో చంద్రముఖి 2
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. తలైవి, మణికర్ణిక వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక ముఖ్య…

నన్ను కంగారు పెట్టేది అదే
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వర రావు
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ తో దూసుకుపోతోన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన తెగింపు
తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్ గా నటించిన సినిమా తునివు. ఈసినిమాను తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడం, దీనికి అజిత్ ఇమేజ్ తోడు కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది.

జపాన్ లో బాహుబలి 2 మూవీ రీ రిలీజ్ ?
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి: ది కంక్లూజన్ మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీతో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందిన బాహుబలి 2 మూవీ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

#NBK 108 మూవీ షూటింగ్ అప్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం…

నెగిటివిటీపై రష్మిక రియాక్షన్
ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు రానంత నెగిటివిటీ స్టార్ హీరోయిన్ రష్మికకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదో ఒక వివాదంతో రష్మిక ట్రోల్ కు గురవుతూనే ఉంది. కాంతార సినిమా విషయంలో కావచ్చు.. విజయ్ తో డేటింగ్ రూమర్స్ కావచ్చు.. సినిమాల విషయంలో కావచ్చు ఇలా పలు నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. ఈమధ్య తను బాలీవుడ్ లో చేసిన మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా సౌత్ పై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని తెచ్చిపెట్టాయి. ఇక సమంత కూడా తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు అని కూడా తెలిపింది. మరోసారి రష్మిక నెగిటివిటీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. రష్మిక మందన్న తన…

అమిగోస్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్.. ఈసినిమాల్లో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలకు రామ్ చరణ్ వివాహ శుభాకాంక్షలు
రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధార్ధ్, కియారా లకు సిసిఎల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్
జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు కిరణ్. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

తారక్ మాడ్యులేషన్ అంటే ఎంతో ఇష్టం - కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హిట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది.

మరోసారి శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సమంత శాకుంతలం కూడా ఒకటని చెప్పొచ్చు. గుణశేఖర్-సమంత కాంబినేషన్ లో సినిమా వస్తుండటం.. అందులోనూ మైథలాజికల్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథతో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్నీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అయితే ఈసినిమా రిలీజ్ పై మరోసారి ఫ్యాన్స్ కు షాకిచ్చారు మేకర్స్. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ నిజంగానే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు…

#RAPO 20 మూవీ లో విలన్ గా హీరో ప్రిన్స్ ?
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు.ఆంధ్ర , తెలంగాణ నేపథ్యం లో సాగే ఒక ఆసక్తికర కథతో ఈ మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం…