గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో .. ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. మరోవైపు పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే సెకండ్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను రేపు సాయంత్రం అంటే ఫిబ్రవరి 9వ తేదీన 4 గంటల 5 నిమిషాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: