జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు కిరణ్. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తే ఫోన్‌నైబరింగ్ కాన్సెప్ట్‌తో ఈసినిమా తెరకెక్కిందని చెప్పొచ్చు. మనకు కష్టం వస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. పక్కనోళ్లు చేస్తే చాలు. ఎవరికి తెలుసు నీ పక్క నంబరే సీఎందో, పీఎందో, సచిన్‌దో, ధోనిదో, పవర్ స్టార్.. ఐకాన్ స్టార్.. రెబల్ స్టార్‌ది కూడా అయ్యుండొచ్చు.. అలాంటివాళ్లలో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా నాకు కచ్చితంగా మంచే జరుగుతుంది అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అయితే ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ క్యూరియాసిటీ పెంచుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Experience a new “Neighbouring” concept packed with Love, Action & Thrills🔥#VinaroBhagyamuVishnuKatha Trailer Out Now 🤩
▶️ https://t.co/HJbhXlQT6U #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #VBVKTrailer #VBVKonFEB17th pic.twitter.com/b5v7UNqdpq— GA2 Pictures (@GA2Official) February 7, 2023
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: